telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఇద్దరు కలిసి తాగితే.. ఆ కిక్కే వేరప్పా.. తాజా అధ్యయనం..

limit alcohol consumption by couple is fine

మద్యనిషేధం ఎప్పుడెప్పుడు విధిస్తారా, మా సంసారాలు ఎప్పుడు సక్కబడతాయా అంటూ.. ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ, పాశ్చాత్య పోకడలతో తాగుడు అనేది రోజురోజుకు ఒక నిత్యావసరం అయిపోయింది. అంతేకాకుండా, ఆలుమగలు ఇద్దరు కలిసి తాగే రోజులు కూడా వచ్చేశాయి. అది చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటే, నిపుణులు మాత్రం మంచిదే, కంటిన్యూ అంటున్నారు.

తాజాగా పరిశోధనలు చేసిన వారు తేల్చిందేమంటే, భార్యాభర్తలు కలిసి మద్యం సేవిస్తే.. అన్యోన్యంగా ఉంటారట. ఇది నిజంగా జరిగేదే అయితే భారతదేశంలో చాలా కుటుంబాలు బాగుపడతాయి.

భార్యాభర్తల సంబంధాలపై జరిపిన ఓ అధ్యయనంలో.. కలిసి మద్యం సేవించే భార్యాభర్తలు సన్నిహితంగా, అన్యోన్యంగా ఉంటారని.. వారిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతకు లోటుండదని తాజా అధ్యయనం తేల్చింది. ఇది వినేందుకు కాస్త వినోదంగా ఉన్నా.. అదే పనిగా కాకుండా వారానికో లేదా మాసానికి ఓసారి కలిసి మద్యం సేవించే భార్యాభర్తలిద్దరూ జీవితంతాం కలిసే ఉంటారని తేలింది.

అలాగే, అతిగా మద్యం సేవించే దంపతుల మధ్య మాత్రం గొడవలకు లోటుండదని అదే అధ్యయనంలో తేల్చారు పరిశోధకులు. దీనిని బట్టి మనం తెలుసుకునే విషయం ఏమిటంటే.. భార్యాభర్తలు విదేశాల్లో మహిళలు, పురుషులు మద్యం సేవించడం చేస్తుంటారు. అదే మన దేశంలో మాత్రం మహిళలు మద్యం అంటే ఆమడ దూరం పారిపోతారు.

అందుకే మన దేశంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ అధ్యయనంలో భార్యాభర్తలు మితంగా మద్యం సేవిస్తే తప్పులేదు కానీ.. అతిగా తీసుకుంటే మాత్రం ఇబ్బందేనని తేలింది.

ఇంకా మద్యాన్ని భార్యాభర్తలు ఇద్దరూ ముట్టుకోకపోతే.. కొత్త ఉత్సాహం లభిస్తుందని.. ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని.. భావితరాల కోసం మద్యపాన సేవనాన్ని పూర్తిగా విస్మరిస్తే ఇంకా మంచిదని కూడా ఈ అధ్యయనంలో వెల్లడి అవడం విశేషం.

Related posts