telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశాల్ “యాక్షన్”… “లైట్స్ కెమెరా యాక్ష‌న్‌…” అంటూ రానా సాంగ్

Action

విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “యాక్షన్‌”. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం టర్కీలో తెరకెక్కిస్తున్నారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం సమకూర్చారు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానరుపై రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా తమన్నా నటిస్తోంది. ఐశ్వర్యాలక్ష్మి, యోగిబాబులు ఇతర తారాగణం. ఫుల్‌ ప్యాకేజీ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. “యాక్ష‌న్” చిత్రం న‌వంబ‌ర్ 15న విడుద‌లవుతుంది. సుంద‌ర్.సి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కాగా… నటుడు, నిర్మాత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న రానా ఇప్పుడు మిత్రుడైన విశాల్ కోసం ర‌్యాప్ సింగ‌ర్‌గా అవ‌తారం ఎత్తారు. “యాక్ష‌న్” చిత్రం కోసం రానా త‌న గొంతు స‌వ‌రించుకున్నారు. హిప్ హాప్ సంగీతం అందించిన ఈ సినిమాలో “లైట్స్ కెమెరా యాక్ష‌న్‌…” అంటూ సాగే ఓ పాట‌ను తెలుగులో రానా పాడారు. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన సాంగ్ ను విడుదల చేశారు. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts