telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌…

క్రేజీ స్టార్ విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ మారిందని టాక్‌. అయితే… ఈ చిత్రానికి చివరగా ‘లైగర్‌’ టైటిల్‌ ఖాయం చేశారు. ఈ మధ‌్యనే ఈ మూవీ టైటిల్ ను ప్రకటించారు. అయితే  ఈ సినిమా నిర్మాత ఛార్మి, హీరోయిన్‌ అనన్య పాండే లైగర్‌ సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌ ఇచ్చారు. రేపు ఉదయం 8:14 గంటలకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించబోతున్న ఛార్మి, అనన్య సోషల్‌ మీడియాలో ద్వారా వెల్లడించింది. పాన్‌ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో లైగర్‌ రిలీజ్‌ కాబోతుంది.  

Related posts