telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

నోకియా స్మార్ట్‌ఫోన్లపై భారీగా తగ్గిన ధరలు

nokia 2.2 released in India

రోజు రోజుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను ఆయా కంపెనీలు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. దీంతో పోటీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో నోకియా స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధరలు తగ్గించారు. భారత మార్కెట్‌లో నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్ ఫోన్లపై రెండు వేల వరకు తగ్గించారు.

6జీబీ ర్యామ్ వేరియంట్ నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.11,999 నుంచి 14,999 వరకు ఉంటుంది. నోకియా 6.1 ప్లస్ ఫోన్ 5.8 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ఎస్‌వోసీ, 4జీబీ, 6జీబీ ర్యామ్, 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వెనక వైపు మూడు కెమెరాలు, 64జీబీ స్టోరేజ్, మైక్రోఎస్డీకార్డు 400జీబీ వరకు, 4జీ వీవోఎల్టీఈ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 3060ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

Related posts