telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరో చిరుత హల్‌చల్‌..ఆందోళనలో స్థానికులు

లాక్‌డౌన్‌ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజేంద్రనగర్‌లో చిరుత రెండు సార్లు అందరినీ కలవరపెట్టింది. తాజాగా…రాజన్న సిరిసిల్లా జిల్లాలో చిరుత పులి వ్యవసాయ బావిలో పడింది. అటవీశాఖ అధికారులు దాన్ని రక్షించే పనిలో నిమిగ్నమయ్యారు. బోయినపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో రాత్రి చిరుత పడ్డట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బావి వద్దకు చేరుకుని రెస్క్యూటీం ద్వారా పులిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిరుతను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం బావి వద్దకు చేరుకున్నారు. చిరుతను సురక్షితంగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టాలని, అప్పుడే తాము ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటామని విజ్ఙప్తి చేస్తున్నారు.

Related posts