telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరోసారి చిరుతపులి కలకలం

లాక్‌డౌన్‌ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజేంద్రనగర్‌లో చిరుత రెండు సార్లు అందరినీ కలవరపెట్టింది. తాజాగా… కొమురంభీం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సిర్పూర్‌ అటవీ ప్రాంతంలో చిరుతపులి కదలికలు కనిపించనట్లుగా స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతంలో రోడ్డు మీద వెళుతున్న వాహనదారులకు పులి ఎదురవడంతో.. అక్కడి ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. సిర్పూర్‌ నుంచి చీలపెల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై అటవీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధైర్యం చెప్పారు. చిరుత కనిపిస్తే వెంటనే సమాచారం అందజేయాలని అధికారులు పేర్కొన్నారు. కాగా ఇటీవలే రాజన్న సిరిసిల్లా జిల్లాలో చిరుత పులి వ్యవసాయ బావిలో పడింది. అటవీశాఖ అధికారులు దాన్ని రక్షించే పనిలో నిమిగ్నమయ్యారు. బోయినపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో రాత్రి చిరుత పడ్డట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

Related posts