telugu navyamedia
సినిమా వార్తలు

అమెజాన్ పునరుద్ధరణకు క్రేజీ హీరో రూ. 36 కోట్ల విరాళం

Amazon

ఈ ప్రపంచానికి ఊపిరితిత్తులు లాంటి బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల్లో మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. భూమి మీద 20 శాతం ఆక్సిజెన్ ఈ అడవుల నుంచే ఉత్పత్తవుతోంది. దీనితో సినీ తారలంతా ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. కానీ హాలీవుడ్ క్రేజీ హీరో లెనార్డో డికాప్రియో స్వయంగా రంగంలోకి దిగాడు. అమెజాన్ అడవులని రక్షించేందుకు భారీ విరాళాన్ని ప్రకటించాడు. అమెజాన్ ఫారెస్ట్ పునరుద్ధరణ కోసం 36 కోట్ల విరాళం అందిస్తున్నట్లు డి కాప్రియో ప్రకటించాడు. అమెజాన్ అడవుల్లో రెస్క్యూ నిర్వహించేందుకు కొన్ని సంస్థలతో కలసి ఎమర్జెన్సీ చర్యలు చేపట్టబోతున్నట్లు డికాప్రియో సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అమెజాన్ అడవులు లేకుండా ప్రమాదకరమైన ‘గ్లోబల్ వార్మింగ్’ ని మనం అదుపు చేయలేం. ఈ అడవులు చాలా ముఖ్యమైనవి అని డికాప్రియో పేర్కొన్నాడు. టైటానిక్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన డికాప్రియో ఇప్పటికి అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. డికాప్రియో 2016లో ఉత్తమ నటుడిగా ‘ది రెవెనెంట్’చిత్రానికి ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

Related posts