telugu navyamedia
crime news Telangana

వామన్ రావు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి…

న్యాయవాది వామన్ రావు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాలు బయటపెట్టాడు. తాను గత నాలుగు నెలల క్రితమే వామన్ రావును హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. వామన్ రావ్ బతికుంటే మనకి ఎప్పుడైనా సమస్య అని భావించిన బిట్టు శీను & కుంట శీనులు ఈ దురాగతానికి పాల్పడినట్టు చెబుతున్నారు. న్యాయవాది వామన్ రావు బిట్టు శీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ పై అనేక కేసులు వేశారని అందుకే నాలుగు నెలల క్రితమే వామన్ రావు హత్యకి కుంట శీను – బిట్టు శీనులు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. నాలుగు నెలల క్రితం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి శీను గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు చెబుతున్నారు. అయితే వామన్ రావు చుట్టూ జనాలు ఎక్కువ ఉండటంతో ప్లాన్ ఫెయిలయిందని అంటున్నారు. ఈ నెల 17వ తేదీన వామనరావు ఒంటరిగా దొరకడంతో బిట్టు శీను & కుంట శీను హత్యకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వామన్ రావు హత్య తర్వాత కుంట శీను బిట్టు శీనుకు ఫోన్ చేసినట్టు కూడా గుర్తించారు. చూడాలి మరి ఈ కేసులో ఇంకా ఏ ఏ విషయాలు బయటికి వస్తాయి అనేది.

Related posts

హైకోర్టును ఆశ్రయించిన రఘురామ కృష్ణరాజు!

vimala p

మేధావులు టీఆర్‌ఎస్‌కి బుద్ది చెప్పాలి.. లేకుంటే తెలంగాణ అన్యాయం అయిపోతుంది

Vasishta Reddy

ఏపీలో జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు

vimala p