telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఎక్కువ సినిమాలలో చేయడం ముఖ్యం కాదు.. మంచి పాత్రలు చేయాలి.. : లావణ్యా త్రిపాఠి

Lavanya-Tripati

టాలీవుడ్ లో ఏడాదిలో ఎన్నో చిత్రాలు వస్తున్నాయి. అయితే అందులో కొందరు మాత్రమే హీరోయిన్ పాత్రలలో మెరుస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే అడపాదడపా కనిపిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆ కోవలోకి చెందిన లావణ్యా త్రిపాఠి తన అవకాశాల గురించి చెప్తూ.. ఒకేసారి నాలుగైదు సినిమాల్లో కనిపించడం ముఖ్యం కాదని, ఒక దాని తర్వాత ఒక సినిమా చేసినా నాకు నచ్చిన సినిమాలే చేయాలనుకుంటున్నాను. చేసే ఒక్కటి అయినా మంచి సినిమా చేయాలి. స్క్రిప్ట్‌ నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించకపోతే సినిమా అంగీకరించడం లేదని అన్నారు.

నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టీఎన్‌ సంతోష్‌ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్‌ సురవ రం’. తమిళ చిత్రం ‘కణితన్‌’కి ఇది తెలుగు రీమేక్‌. బి.మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – మొదట ఈ సినిమాకు నో చెప్పాను. రీమేక్‌ సినిమాలో చేయడానికి ఏం ఉంటుంది? అనే ఉద్దేశంతో అలా అన్నాను. కానీ కథ వినగానే చాలా నచ్చింది. ఇందులో జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తాను. చాలా స్ట్రాంగ్‌ అమ్మాయిని. నకీలి సర్టిఫికెట్స్‌ మాఫీయా గురించి ఈ సినిమాలో చర్చించాం. దాని వల్ల టాలెంట్‌ ఉన్నవాళ్లు కూడా ఎలా నష్టపోతున్నారో చూపించాం. ఈ సినిమాలో కొన్ని రిస్కీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి.

ఒక సన్నివేశంలో కారులో నుంచి బయటపడబోయేదాన్ని. కొంచెంలో మిస్‌ అయింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్‌ థ్రిల్లింగ్‌గా ఉంది (నవ్వుతూ). ‘అర్జున్‌ సురవరం’ రిలీజ్‌ ఆలస్యం కావడంతో సినిమా ఏమైనా అవుడ్‌ డేట్‌ అయిపోతుందా, స్టేల్‌ అయిపోతుందా? అనే ఆలోచన నాక్కూడా వచ్చింది. కానీ మా ట్రైలర్‌ని చూసినవాళ్లందరూ ఫ్రెష్‌గానే ఉంది అంటున్నారు. ‘ఈ మధ్య వరుసగా సినిమాలు చేయడం లేదేంటి?’ అని కొంతమంది అడుగుతున్నారు. ‘అర్జున్‌ సురవరం’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కానున్నారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను 26న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. చిత్రబృందం తరఫున ఈ వేడుకకు చిరంజీవిని అహ్వానించారు నిఖిల్‌.

Related posts