telugu navyamedia
culture news telugu cinema news

లతా మంగేష్కర్ కు తీవ్ర అస్వస్థత.. ముంబయి ఆసుపత్రిలో చికిత్స

Latha-Mangeshkar

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముంబయిలో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు.

అప్పటికే ఆమె విషమ పరిస్థితిలో ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్యనే లత 90వ ఏడులో ఆమె అడుగుపెట్టారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తుంటారు. ఆమె అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

Related posts

మార్కెట్ లో బంగారం ధరలు..

vimala p

టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేయడంలో జాప్యం: రాహుల్

vimala p

ఇంటర్ బోర్డ్ లో మరో నిర్లక్ష్యం..ఒకే విద్యార్థికి రెండు హల్ టికెట్లు

vimala p