telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” అనుకున్న సమయానికే విడుదల కానుందా ?

RRR

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. జూలై 30, 2020న విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై స‌నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే భారీ చిత్రం కావడం వల్ల, షూటింగ్ అనుకున్న విధంగా సాగకపోవడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అనుకున్న విధంగా జూలై 30న కాకుండా, దసరాకు విడుదల ఉండొచ్చని టాక్ వచ్చింది. అయితే అనుకున్న సమయం కంటే ముందే `ఆర్ఆర్ఆర్` షూటింగ్ పూర్తవుతోందని తెలుస్తోంది. జనవరి రెండో వారానికల్లా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. నాలుగైదు నెలలు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతాయని, అనుకున్నవిధంగా జూలై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తాజా సమాచారం.

Related posts