telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా ?

ntr

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న”ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. “ఆర్ఆర్ఆర్” తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మించాలని సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఎన్టీఆర్ కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక తమిళ దర్శకుడు అట్లీతో తారక్ సినిమా ఉండబోతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య అట్లీ కూడా తెలుగులో సినిమా తీస్తానని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో అట్లీ.. తమిళ హీరో జయం రవితో సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related posts