telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్”పై ఎన్నికల కమిషన్ వ్యాఖ్యలు

Lakshmi's-NTR

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరుతో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 22న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో టీడీపీ అధినేత చంద్రబాబును నెగటివ్ గా చూపిస్తున్నారని, తొలివిడత పోలింగ్ ముగిసే వరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌కు నిన్న ఫిర్యాదు చేశారు. వర్మ మాత్రం తాను చచ్చినా ఈ సినిమా విడుదల అవుతుందని, ఒకవేళ వెండి తెరపై విడుదల చేయనీయకపోతే యూట్యూబ్ లో విడుదల చేస్తానని స్పష్టం చేశారు.

తాజాగా “లక్ష్మీస్ ఎన్టీఆర్”పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ స్పందించారు. సినిమా విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయమే ఫైనల్ అని, ఈ సినిమాపై ఢిల్లీలో ఫిర్యాదు చేశామని, ఎన్నికల కోడ్ ను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని, రాజకీయ పార్టీలకు వ్యతిరేఖంగా లేదా అనుకూలంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా రూల్స్ ప్రకారం ఇబ్బందులు తప్పవని రజత్ కుమార్ వివరించారు. దీంతో అసలు “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలవుతుందా ? లేదా ? అని వర్మ అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. మరి వర్మ ఏం చేస్తాడో చూడాలి.

Related posts