telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హిమాలయాల్లో బోయపాటి, బాలయ్య సినిమా షూటింగ్

Boyapati

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.’సింహా’.. ‘లెజెండ్’ వంటి సంచలన విజయాల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర రాయలసీమ నేపథ్యంలో… మరో పాత్ర వారణాసి నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. వారణాసిలో అఘోరాగా కనిపించే పాత్ర తాలూకు సన్నివేశాలు కొన్ని హిమాలయాల్లోను చిత్రీకరించనున్నారట. అందువలన పరిస్థితులు కుదురుకున్నాక అక్కడ ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక రాయలసీమకి చెందిన పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇతర దేశాల్లో చిత్రీకరించవలసివుంది. ఇప్పట్లో అంతటి రిస్క్ చేయడం కరెక్ట్ కాదని భావించిన బోయపాటి, హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేయించనున్నాడట. లాక్ డౌన్ పూర్తికాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా ద్వారా బోయపాటి ఒక కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts