telugu navyamedia
సినిమా వార్తలు

ఈ తరం ఆలోచనలు ప్రతిబింబించే “నీహారిక ప్రశాంత్ “

Niharikha Prashanth
సిడీటాకీస్ యూత్ నిర్మించిన ఇండిపెండెంట్ చిత్రాన్ని చాలామంది మెచ్చుకున్నారు . ఈ చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు . నేటి యువతరం ముఖ్యంగా ఐటి రంగంలో వున్నవారు ఇటీవల కాలంలో లఘుచిత్రాలకి ఆకర్షితమౌతకూండటం వల్ల ఎన్నో సంఘటనలు, సమస్య లు ఎదురవుతున్నయి . అయినా  కూడ ఎన్నో లఘుచిత్రాలు రూపుదిద్దుకుని  యుట్యూబ్ లో వచ్చేస్తున్నాయి . 
యువతరానికి ఉత్సాహాన్ని ప్రోత్సహాన్ని అందిస్తుంన్నాయి. వీటి స్పూర్తితో  50నిమిషాల నిడివి కలిగిన  చిత్రం “నిహారికప్రశాంత్”  కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలను నిర్వ వహిస్తూ యువ దర్శకుడు సిద్ధార్థకందాళ, ప్రేమ, ప్రణయం,ప్రతీకారం కలగలుపుగా తీసిన చిత్రంనీహారిక ప్రశాంత్ . 
Niharikha Prashanth
టీనేజ్ అనేది యువతరానికి మర్చిపోలేని అనుభవం . అందులో ప్రేమ అనేది ఒకనవలోకం . అందులో ఊహలకందని మధురభావాలతో   ప్రేమలోపడిన జంట నీహారిక ప్రశాంత్ . . వీరి  ప్రేమఫలించివివాహమవుతుంది. వారి వైవాహిక జీవితం సాగుతూ ఉండగా   ఊహించని సంఘటన జరుగుతుంది . 
ప్రధానపాత్రలో  నిహారికగా పద్మిని నటన ఆద్యంతం  ఆకట్టుకుంది.  ప్రశాంత్ పాత్ర లో రవిరాజ్ ఒదిగి పోయాడు, ఇతరపాత్రల లో చరణ్ వినయ్ రవి శ్రీధర్, దివ్య నటించారు . దర్శకుడు సిద్ధార్థకందాళ ఈ చిత్రాన్ని ప్రతిభావంతంగా తీర్చిదిద్దాడు .

Related posts