telugu navyamedia
సామాజిక హాస్యం

వెలుగు నిచ్చే సూర్యుడు కూడా మసిబారాడా?

school teachers class

వెలుగు నిచ్చే సూర్యుడు కూడా మసిబారాడా?
నిజమే అనిపిస్తుంది
ఎందరి జీవితాల్లో వెలుగు నింపిన గురువుకు
నేడు తన భవిష్యత్తు ఏమిటో?
తెలియని వేదన
దీనికి కారణం ఎవరిని నిందించాలో తెలియని
అగమ్యగోచర సంకట పరిస్థితి
రేపు ఉందా అంటే ఆకాశం వైపు పిచ్చి చూపులు
గురుర్బహ్మ: గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః అని పొగిడిన గొంతులు
నేడు మౌనంగా ఎందుకున్నాయి
అన్ని రంగాల ప్రజలు
పాలకులకు ఆప్తులయ్యారు
విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపే సూర్యుడు మసక బారాడు
కష్టాలు వస్తే పదిమందికి ధైర్యం
చెప్పే ఆ గుండె
నేడు కష్టాల కడలిలో కన్నీరై పారుతుంది
గౌరవముతో శిఖరాగ్రాన నిలిచిన గురువు స్థానం
ఆకలి కోసం క్యూ లైన్ లో నిల్చున్న చివరి స్థానం
నేటి గురువు పరిస్థితి.
ఈ పరిస్థితికి కారణం !
కరొనా రక్కసి కాటేసిందా !
పాలకుల మనసు కాఠిన్యమైందా !
బతుకు దారి చూపిన గురువుకు బతుకు దారేది
ఇలాగే కొనసాగితే
మూతపడే బడ్జెట్ పాఠశాలల పరిస్థితి ఏమిటి ?
అక్కడి ఉపాధ్యాయుల చూపు ఎటు ?
యాజమాన్యంల పరిస్థితి త్రిశంకు స్వర్గమేనా !
పనిలేని పేద ప్రజలకు
ఉపాధి హామీ కల్పించి ఆదుకున్న ప్రభుత్వాలు
పనిలేని గురువులకు
పనికల్పించి అండగా నిలబడి
ఆదుకునే పాలకుల వైపు
ఆశగా ఎదురుచూస్తున్న
అభాగ్యజీవులు నేటి గురువులు.
అందరికి ఆదర్శంగా నిలిచిన గురువు నేడు
అంగట్లో బలి పశువయ్యాడు. బడ్జెట్ పాఠశాల భవితవ్యం
గురువుల జీవితాలు*
బహుదూరపు బాటసారిలా !
గమ్యం తెలియని
వారి నడక ఎందాక, ఎటు వైపు
భేతాళుని కథలా సాగిపోవాల్సిందేనా
రేపటి బడి గంటలు ఎప్పుడు
మ్రోగునో
గురువుల వేదన చల్లారేది ఎప్పుడూ
జవాబులేని ప్రశ్న
జగమంత తెలుసు
కానీ పట్టించు కొనే నాథుడు ఏడి…మన భారతావనిలో….
బంగారు తెలంగాణ అంటాడొకండు,సింగపూర్ చేస్తానంటాడొకండు, రాజన్నపాలనంటాడొకండు,…
ఇవన్నీ మాకొద్దు, యింత ముద్ద పెట్టండి

గురువును త్రిమూర్తుల సరసన ఉంచకపోయినా నష్టంలేదు, కనీసం సాటి మనషిగా చూస్తే చాలు.


ప్రైవేట్ టీచర్

Related posts