వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. అయితే ఈ సినిమాపై మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పలు వివాదాలు కూడా సినిమాను చుట్టుముట్టాయి. “కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆర్జీవీ కొన్ని విషయాలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత జొన్నవిత్తలు మండిపడ్డారు. ఇద్దరి మధ్య అనేక వాగ్వాదాలు చోటు చేసుకోగా, ఆర్జీవి.. జొన్నవిత్తులని జొన్న పొత్తు అని కామెంట్ చేయడం, జొన్న విత్తుల.. వర్మని పప్పు వర్మ అని కామెంట్ చేయడంతో రచ్చ పీక్ స్టేజ్‌కి చేరింది. అయితే వర్మ చేసిన కొన్ని కామెంట్స్‌కి ఒళ్లు మండిన జొన్న విత్తుల వర్మపై బయోపిక్ తప్పక చేస్తానని , దాన్ని మియామాల్కోవాకు అంకితం ఇస్తానని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు . అయితే.. అన్నట్టుగానే ఇప్పటికే ఆ సినిమా పనులు ప్రారంభించారట జొన్న విత్తుల. వర్మలా ఉండే ఓ వ్యక్తిని.. బీహార్ నుంచి పట్టుకొచ్చాడని అంటున్నారు. ఆయనకి నటనలో శిక్షణ ఇప్పిస్తుండడంతో పాటు వర్మ మేనరిజాన్ని అనుకరించేలా ట్రైనింగ్ ఇస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
previous post
next post