telugu navyamedia
telugu cinema news trending

పాటల్ని తగ్గించే పనిలో “ఆర్ఆర్ఆర్” టీం ?

RRR

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ ఆగింది. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇటీవల సినిమా షూటింగ్ లకు అనుమతులు దొరికినా ఎవ్వరూ సాహసించడం లేదు. ఇక రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడప్పుడే షూటింగ్స్ జరిగేలా కనిపిచండం లేదు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింది . ఇంకా దాదాపు 30 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉంది. విడుదల తేది దగ్గరకు వస్తోంది. దీంతో “ఆర్ఆర్ఆర్”లో కొన్ని పాటలు తగ్గించే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. ఈ సినిమాలో మొత్తంగా పది పాటల వరకు ప్లాన్ చేసిందట చిత్రబృందం. అయితే అందులో కొన్ని పాటలను తీసేసి షూటింగ్ పూర్తి చేయాలనీ భావిస్తున్నాడట రాజమౌళి.

Related posts

2014 ఎన్నికలలో నన్ను వాడుకుని .. వదిలేశారు .. : పవన్ కళ్యాణ్

vimala p

“మహర్షి” సెలెబ్రేషన్స్… స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ

vimala p

22న 15మంది ఎమ్మెల్యేల .. ప్రమాణస్వీకారం.. జలవనరుల శాఖపై పలువురి కన్ను..

vimala p