telugu navyamedia
సినిమా వార్తలు

ఎఫ్-2 : డిలీటెడ్ సీన్-4… మీడియా ముందు వెంకీ రొమాన్స్

F2

“ఎఫ్-2” చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ లకు జోడిగా తమన్నా, మెహ్రీన్ లు నటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ చిత్రం ఇటీవలే యాభై రోజుల వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందనతో “ఎఫ్-2” సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. తాజాగా “ఎఫ్-2” సినిమాలో తొలగించిన సన్నివేశాన్ని “ఎఫ్-2″ : డిలీటెడ్ సీన్-4” అంటూ దిల్ రాజు తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఈ వీడియోలో వెంకీ ఎమ్మెల్యే మీడియా ముందు మాట్లాడుతుండగా… వెంకీ ఫోన్లో ముద్దులు ఇస్తూ… ఎమ్మెల్యే ను డిస్టర్బ్ చేసిన తీరు చూస్తే తప్పకుండా నవ్వుకుంటారు.

Related posts