telugu navyamedia
sports trending

భారత్-ఆస్ట్రేలియా .. ఆఖరి వన్డే నేడే.. ! మనకి సిరీస్ వస్తుందా.. వాళ్ళకి హ్యాట్రిక్ ఇస్తారా!!

first odi india-australia in uppal stadium

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్ లో ఆఖరి వన్డే నేడు జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన 4 వన్డేలలో ఇరు జట్లు చేరు రెండు మ్యాచ్ లలో గెలిచిన విషయం తెలిసిందే. దీనితో నేటి మ్యాచ్ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత మ్యాచ్ లలో చివరి ఓవర్ వరకు ఉన్న ఉత్కంఠ నేడూ ఉండనుంది. నేడు భారత్ గెలిస్తే, సిరీస్ కైవసం అవుతుంది. లేదంటే ఆస్ట్రేలియా కు హ్యాట్రిక్ తో పాటుగా నిన్న టీ20 నేడు వన్డే సిరీస్ లు కట్టబెట్టినట్టే అవుతుంది.

ధోనీ వారసుడిగా భావిస్తున్న రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో ఓకే అయినా.. వికెట్ల వెనుకాల తేలిపోయాడు. ఈ స్థితిలో దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇస్తారా? ఎంత ఒత్తిడి ఉన్నా మ్యాచ్‌లో ధోనీ ఇచ్చే సలహాలు, సూచనలే ఇప్పటి వరకు కోహ్లీని నడిపించాయి. కానీ కొండంత స్కోరు చేసిన నాలుగో వన్డేలో విరాట్ నాయకత్వ లోపాలూ కొట్టొచ్చినట్లు కనిపించాయి. మరి ఈ లోపాలను టీమ్‌ ఇండియా.. ఈ మ్యా చ్‌లో అధిగమిస్తుందా? లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ధవన్, రోహిత్ గాడిలో పడటంతో ఓపెనింగ్ సమస్య దాదాపు తీరినట్లే. ఈ ఇద్దరు ఇచ్చిన శుభారంభంతోనే నాలుగో వన్డేలో భారీ స్కోరు సాధ్యమైంది. అదే జరిగితే మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కానీ ఇంకా వేట కొనసాగుతున్న నాలుగో నంబర్‌కు రాయుడును తీసుకుంటారా, లేక రాహుల్‌కు మరో అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. పవర్ హిట్టింగ్‌తో పరుగులు సాధిస్తున్న రిషబ్.. కీపర్‌గా వికెట్ల వెనుక నిరూపించుకోవాల్సి ఉంది.

గత మ్యాచ్‌లో కీలక సమయంలో స్టంపౌట్ మిస్ చేయడం విమర్శలకు దారితీసింది. కేదార్ జాదవ్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉంది. పీసీఏ స్టేడియం ఫిచ్ ఫ్లాట్‌గా ఉందనడంలో సందేహం లేకపోయినా.. ప్రపంచ స్థాయి బౌలర్లు 350 స్కోరును కాపాడలేకపోయారన్నదే జీర్ణించుకోవడానికి కష్టంగామారింది. ముఖ్యంగా టర్నర్ కొట్టిన తీరుకు కనీసం బంతుల్లో మార్పు చేయాలన్న ధ్యాస కూడా టీమ్‌ఇండియా బౌలింగ్ బృందానికి గుర్తుకురాలేదు. దీనికితోడు మిస్ ఫీల్డింగ్ అతిపెద్ద సమస్యగా మారింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు మనకే వ్యతిరేక ఫలితాన్నిచ్చాయి. చాహల్, కుల్దీప్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌కు వెళ్తే జడేజాకు అవకాశం దక్కొచ్చు.

Related posts

తమిళనాడులో .. 146 కేజీ ల బంగారం పట్టుకున్న ఈసీ ..

vimala p

ఈవ్-టీజింగ్ ఆపినందుకు… మహిళను వివస్త్రను చేసి.. విధులలో..

vimala p

శ్రీదేవి మృతిపై .. మళ్ళీ రగడ.. స్పందించిన బోనిక‌పూర్

vimala p