telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆఖరి క్షణంలో .. రైలు టిక్కెట్ల బుకింగ్ చాలా ఎక్కువైపోయాయట..

last minute train ticket bookings drastically increased

ప్రయాణం పెట్టుకున్నాక టిక్కెట్లు బుకింగ్ ప్రాథమిక పని, ఇక అదికూడా ఆఖరి క్షణంలో చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఈ హడావుడి బ్యాచ్ ఎక్కువని ఇటీవల తెలిసింది. రైలు ప్రయాణం చేయాలనుకునే వారిలో ఆఖరి క్షణంలో తత్కాల్ ను ఆశ్రయించేవారి సంఖ్యే అధికమని తేలింది. సమాచర హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని, ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇవ్వగా, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఒక్క తత్కాల్ టికెట్ల అమ్మకాల ద్వారానే రూ. 25,392 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 2016 నుంచి 2019 మధ్య తత్కాల్ ద్వారా రూ. 21,530 కోట్లు, ప్రీమియం తత్కాల్ ద్వారా రూ. 3,862 కోట్ల ఆదాయం లభించింది.

గత సంవత్సరంతో పోలిస్తే ఇది 62 శాతం అధికం కావడం గమనార్హం. చివరి నిమిషంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం 1997లో తత్కాల్ సేవలు ప్రారంభం కాగా, తొలుత 30 శాతం వరకూ అదనంగా చెల్లించాల్సివుండేది. ఆపై 2014లో డైనమిక్ సిస్టమ్ ను ప్రవేశపెట్టగా, 50 శాతం అధిక రుసుముపై టికెట్ల జారీ ప్రారంభమైంది. నిత్తమూ తత్కాల్ స్కీమ్ కింద 2,677 రైళ్లలో 1.71 లక్షల సీట్లు, బెర్తులు అందుబాటులో ఉంటుండగా, ప్రధాన రైళ్లలో వీటికి కూడా వెయిటింగ్ లిస్ట్ అధికమే.

Related posts