telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నేడే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ.. బరిలో ఉండే గుర్రాలు ఎవరో.. !

election nomination starts from today

నేడు సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకోడానికి ఆఖరి రోజు. దీనితో అసలు బరిలో ఉండేది ఎవరు అనేది నేటి అనంతరం తెలిసిపోనుంది. నేడు ఎవరెవరు ఉపసంహరించుకుంటారు అనేదానిపై ఆసక్తి నెలకొంది. కొన్ని నియోజక వర్గాలలో బరిలో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు రేసుగుర్రాలు ఎవరనేది నేటితో తేలనుంది.

ముఖ్యంగా నిజామాబాద్ లో కవితపై 245 రైతులు నామినేషన్ వేశారు. వారిని బుజ్జగించేందుకు తెరాస కృషి చేసినా, ఫలితం దక్కినట్టేమీ కనిపించడంలేదు. ఇక మోడీపై కూడా భారీగానే రైతులు నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో గుంటూరు లో అధికసంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. వాటిలో కూడా ఎవరు నిజంగా బరిలో దిగుతున్నారనేది నేటితో తేలనుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపటిలోగా ఎన్నికల సంఘం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది.

Related posts