telugu navyamedia
telugu cinema news

“లక్ష్మీస్ వీరగ్రంథం” కొత్త టీజర్ 

Lakshmi's-NTR
టాలీవుడ్ లో దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా మూడు చిత్రాలు పోటాపోటీగా తెరకెక్కుతున్నాయి. ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో “ఎన్టీఆర్ బయోపిక్”, మరోవైపు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”, ఇంకోవైపు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో “లక్ష్మీస్ వీరగ్రంథం” చిత్రాలు రూపొందుతున్నాయి. తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి “లక్ష్మీస్ వీరగ్రంథం” నుంచి మరో టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ “ఎన్టీఆర్ గుడిలో విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు..” అంటూ ఇటీవల నాదెండ్ల భాస్కరరావు చేసిన ఆరోపణలతో ప్రారంభమైంది. ఆ తరువాత ఎన్టీఆర్ వాయిస్ తో కొనసాగిన ఈ వీడియోలో లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ తిడుతున్నట్లుగా ఉంది. లక్ష్మీపార్వతి వల్లనే ఎన్టీఆర్ అధికారాన్ని పోగొట్టుకున్నట్టుగా ఈ టీజర్ లో చూపించారు.

Related posts

కంగనా చేతిలో “బాహుబలి”ని మించిన సినిమా

vimala p

స్మృతి పథంలో దాసరి నారాయణ రావు

vimala p

సాహోతో .. రాజమౌళి..

vimala p