telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ వీరగ్రంథం” ట్రైలర్

Lakshmi's-Veeragrandham

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో రెండుభాగాలుగా తెరకెక్కించిన “ఎన్టీఆర్ బయోపిక్” పరాజయం పాలైంది. ఇప్పుడు ఎన్టీఆర్ పై మరో రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఒకటి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరువాత కథతో వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను తెరకెక్కిస్తున్నాడు. రెండు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి “లక్ష్మీస్ వీరగ్రంథం” పేరుతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ల‌క్ష్మీ పార్వ‌తిగా శ్రీ రెడ్డి నటిస్తున్నారు. నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా “లక్ష్మీస్ వీరగ్రంథం” ట్రైలర్
ను ఈరోజు విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఇంట్లోకి ప్రవేశించగానే దీపాలు ఆరిపోయినట్లు, గద్ద అక్కడే తచ్చాడినట్లు చూపించారు. అంతేకాదు “తెలుగింటి గడపపై విరజిమ్మిన విషం” అనే క్యాప్షన్ ను కూడా జతచేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను బెంగళూరులో చిత్రీకరిస్తున్నారు.

Related posts