telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలపై ఆర్జీవీ ధీమా

Laxmis NTR movie compliant CEC

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ చిత్రానికి ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యాడు నిర్మాత రాకేశ్ రెడ్డి. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అంతకు ముందు ఎన్నికల సంఘం చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేయగా ఫోన్ ద్వారా సమాధానం చెప్పాడు రాకేశ్ రెడ్డి. కానీ ఈరోజు ఈసీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని స్పెషల్ షో వేసి చూపించారు. ఉదయం 11:20కి షో ప్రారంభమైంది. దీనిపై స్పందించిన రాకేశ్ రెడ్డి.. సినిమా చూసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు దర్శకుడు ఆర్జీవీ సినిమా మార్చి 29న రావడం ఖాయం అన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.

Related posts