telugu navyamedia
telugu cinema news trending

“లక్ష్మీస్ ఎన్టీఆర్”లో జూనియర్ ఎన్టీఆర్

Lakshmi's-NTR

ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్… మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ ను “లక్ష్మీస్ ఎన్టీఆర్”గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలతో “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను తెరకెక్కిస్తున్నాడు వర్మ. అయితే ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి, జూనియర్ ఎన్టీఆర్ ల ఎపిసోడ్ ఉంటుందనేది తాజా సమాచారం.

చాలాకాలం నుంచి లక్ష్మీపార్వతి, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ఓ వార్త విన్పిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను, అతడి తల్లి శాలినిని సీనియర్ ఎన్టీఆర్ కు పరిచయం చేసింది లక్ష్మీపార్వతి అనేది ఆ వార్త. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం లక్ష్మీపార్వతి మీద ఉన్న కోపంతో ఎన్టీఆర్ ఇంట్లోని లక్ష్మీపార్వతి ఫొటోలన్నీ చించేశాడట. ఇప్పుడు మన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తెరకెక్కించబోయే “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో ఈ సన్నివేశాలను పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను అసలు విడుదలవనిస్తారా ? అనే సందేహం చాలామందిలో ఉంది. మరి ఇలాంటి వివాదాస్పద అంశాలను కూడా వర్మ అందులో చేరుస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.




Related posts

ప్రేమలో పడ్డ త్రిష… ఆ వ్యక్తి ?

vimala p

శృంగార సామర్ధ్యానికి.. ఈ ‘గ్రా’మర్ సరిపోద్ది..

vimala p

తాకరాని చోట తాకారు : కంగనా రనౌత్ 

ashok