telugu navyamedia
సినిమా వార్తలు

ఫిల్మ్ నగర్లో “లక్ష్మీస్ ఎన్టీఆర్”పై నిషేధం

Laxmis NTR movie compliant CEC

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మే 29న తెలంగాణాలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. అయితే ఇప్పుడు “లక్ష్మీస్ ఎన్టీఆర్”పై జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ) నిషేధం విధించింది. కొత్తగా విడుదలైన సినిమాను ప్రతి శనివారం ప్రత్యేకంగా ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యుల కోసం ప్రదర్శిస్తారు. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు.

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంపై రూపొందిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను మాత్రం అక్కడ ప్రదర్శించడం లేదు. ఈ సినిమా విడుదలకు ఓ వర్గం వారు అడ్డుతగలడమే దానికి కారణం. తెలుగురాష్ట్రాల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను ప్రదర్శించాలని కొంతమంది ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యులు కోరగా, సినిమాను ప్రదర్శించేందుకు గత శనివారం ఏర్పాట్లు చేశారు. కానీ సభ్యుల్లో ఓ వర్గానికి చెందినవారు మాత్రం సినిమాను ప్రదర్శించవద్దంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు సినిమా విడుదలకు అంగీకరించలేదు. ఎలాంటి నిషేధం లేకుండా తెలంగాణాలో విడుదలైన ఈ సినిమాను ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రదర్శించకపోతే, ఒక వర్గం వారికే పెద్ద పీట వేస్తున్నారనే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది సభ్యులు.

Related posts