telugu navyamedia
telugu cinema news

“లక్ష్మీస్ ఎన్టీఆర్” రిలీజ్ డేట్ ఇదే ?

rgv lakshmis ntr movie trailer on 14 feb
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రిష్, బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను మొదలుపెట్టగానే వర్మ కూడా సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్ తో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇటీవల “మహానాయకుడు” విడుదలకు ముందు “లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ట్రైలర్ ను విడుదల చేసి సంచలనం సృష్టించారు వర్మ. అయితే ఈ సినిమా విడుదల గురించి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
“మహానాయకుడు” విడుదల తేదీ ఖరారైన తరువాత “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదల తేదీని ప్రకటిస్తానని చెప్పిన వర్మ ఇంకా ఆ పని మాత్రం చేయలేదు. దీంతో సినిమా అసలు విడుదలవుతుందా ? లేదా ? అనే సందేహం కలుగుతోంది అందరిలో. అయితే తాజా సమాచారం ప్రకారం మార్చి 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయట. చిత్రంలో “లక్ష్మీపార్వతి” పాత్రలో యజ్ఞాశెట్టి నటిస్తోండగా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నాడు. ఇక చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ కూడా తీవ్ర నిరాశను మిగిల్చాయి. అయితే “లక్ష్మీస్ ఎన్టీఆర్”పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రమైనా హిట్ అవుతుందేమో చూడాలి.

Related posts

వంద కోట్లు కొల్లగొట్టిన హిందీ “2 పాయింట్ 0” 

vimala p

బాలకృష్ణ, పూరీ కాంబినేషన్ లో సినిమా ?

vimala p

నా నేస్తమా నువ్వెక్కడ..

vimala p