telugu navyamedia
telugu cinema news

“లక్ష్మీస్ ఎన్టీఆర్” మూవీ సెన్సార్ ఎప్పుడు ?

Lakshmi's-NTR
ఇప్పుడు సినిమా రంగంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ను “లక్ష్మీస్ ఎన్టీఆర్ “సినిమా మీదనే ఎక్కువ చర్చిస్తున్నారు . 
రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్ ఇదే . తెలుగు దేశం వారు ఈ సినిమా డామేజ్ చేస్తుందేమో అని భయపడుతున్నారు . 
సినిమా విదులైతే తమకు లాభం చేకూరుతుందని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు భావిస్తున్నారు మహానటుడు , నాయకుడు ఎన్టీఆర్ జీవితం మీద తీస్తున్న ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది . 
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ను ఈ నెల 22 న విడుదల చేస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు . విడుదల ఆపుచేయాలని తెలుగు దేశం కార్యకర్త దేవీబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను ఆశ్రయించాడు . ఈ సినిమా తమ కుటుంభం పరువుతీస్తుందని రామారావు కుటుంబ సభ్యులు కేంద్ర సెన్సార్ అధికారి ప్రసూన్ జోషికి ఫిర్యాదు చేశారు . 
వాడ వివాదాలు జరుగుతూ ఉండగా నిర్మాత రాకేష్  రెడ్డి ఈ సినిమాను   నాలుగు రోజుల క్రితం సెన్సార్ కు అప్లై చేశారు . 
అయితే ఈ సినిమా గురించి ప్రాంతీయ సెన్సార్ అధికారి రాజశేఖర్  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది . 
కేంద్ర సెన్సార్ బోర్డు నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా ? లేదా సీరియల్ ప్రకారం సెన్సార్ చేద్దామని రాజశేఖర్ చూస్తున్నాడా ?అన్నది తెలియడం లేదు . అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో నిర్మాత దర్శకులు ఆందోళన చెందుతున్నారు . 
ఇక ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని చూస్తున్న కొనుగోలుదారులు అసలు సెన్సార్ అవుతుందా ? లేదా ?మధ్యలో ఏమైనా అవాంతరాలు వస్త్తాయా ? అనే అనుమానాలతో వున్నారు . ఏమైనా ఈ సినిమాను విడుదల చేసి తీరతాం అని రాకేష్ రెడ్డి , రామ్ గోపాల్ వారం ఛానెళ్లలో ప్రకటించేస్తున్నారు . ఒకవేళ ముంబై నుంచి సినిమా సెన్సార్ చెయ్యమని ఆదేశాలు వచ్చినా ఈ సినిమా చుసిన తరువాత సభ్యుల మనోభావాలు ఎలా వుంటాయో ?
ఎన్ని కట్లు ఇస్తారో ? వాటిని తీసివేసి మళ్ళీ సెన్సార్ అధికారికి చూపించాలి . అప్పుడు కానీ క్లీరెన్సు రాదు . నిజానికి ఇది వెంటనే జరిగే వ్యవహారం కాదు . రెండు మూడు  రోజుల్లో కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో  క్లారిటీ వచ్చే అవకాశం వుంది . 
– భగీరథ

Related posts

రజినీకాంత్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్

vimala p

శోభన్ బాబు పిల్లలు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమిదే…!?

vimala p

“మజిలీ” మా వ్యూ

vimala p