telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కర్ణాటకలో వింత ఆచారాం… దేవుడికి చెప్పులే నైవేధ్యం

ఏ కష్టం వచ్చిన ప్రతి ఒక్కరూ గుళ్లకు వెళతారు. దేవాలయాలకు పోయి తమ కోరికలు కోరుకుంటారు. అలాగే.. ఆ దేవుడికి ఏదో ఒక రూపంలో కానుకలు వేస్తారు. కొందరు డబ్బులు వేస్తే.. మరికొందరు బియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు. గుడికి వెళితే.. చెప్పులు లేకుండా పోతాం కూడా. అది మన హిందూ సంప్రదాయం. ఇది ఇలా ఉండగా.. కర్ణాటకలోని కాలాబురాగి జిల్లాలో ఉన్న లక్కమ్మ దేవి ఆయలంలో ఓ వింత ఆచారం ఉంది. ప్రతీ ఏటా దీపావళి తర్వాత ఆరో రోజు జరిగే జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులు అమ్మవారికి చెప్పుల దండను సమర్పించుకోవడం ఆనవాయితీ అట. కాలాబురగి జిల్లా కేంద్రానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గోలా-బి- గ్రామంలో ఉంది ఆ అమ్మవారి దేవాలయం. కుల మతాలకు అతీతంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే.. కోరిన కోర్కెలు తీరిన వారు.. అమ్మవారికి చెప్పులు సమర్మించుకుంటారట. అలా చేస్తే.. అమ్మవారు కరుణిస్తారట. అదే అక్కడ జరుగుతున్న వింత ఆచారం. ఈ విషయం తెలిసిన కొత్త వాళ్లు చాలా ఆశ్చర్యపడుతున్నారు.

Related posts