telugu navyamedia
news political Telangana trending

తెలంగాణాలో… లగడపాటి సర్వే…మహాకూటమే..

Lagadapati Telangana Elections Results

తెలంగాణాలో నేడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ కు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే అన్ని ఎగ్జిట్ పోల్స్ తెరాస కు మ్యాజిక్ నెంబర్ కంటే ఎక్కువ సీట్లు వస్తున్నట్టు తేల్చేశాయి. కానీ లగడపాటి మాత్రం ప్రజా కూటమి అంటుండటం విశేషం. అయితే నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన తాజా సర్వే తెలంగాణ ఎన్నికలపై విడుదల చేయనున్నారు. ఆ వివరాలు ..

లగడపాటి ఎగ్జిట్ పోల్స్ :
తెలంగాణాలో మొత్తం స్థానాలు 119:
తెరాస : 25-45
కాంగ్రెస్+: 55-65{కాంగ్రెస్ : 58, టీడీపీ : 7-9}
బీజేపీ : 5-9
ఎంఐఎం : 6-7
ఇతరులు : 5-7

ముందుగా అనుకున్నట్టుగా గతంలో కంటే అధిక శాతం పోలింగ్ నమోదైంది. సెప్టెంబర్ నుండే చాలాసార్లు సర్వే లు నిర్వహించడం జరిగింది. అప్పటిలో వచ్చిన అంచనాలను ఆయా పార్టీలకు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ప్రజా కూటమికి 65(10 అటో ఇటో) స్థానాలు, తెరాస కు 35(10 అటో ఇటో) స్థానాలు, బీజేపీకి 7, ఇతరులు 7 స్థానాలను దక్కించుకుంటారు. అయితే ఈ అంచనా కోసం అనేకరకాలుగా, మూడు నెలలుగా తీవ్రంగా శ్రమించామని ఆయన తెలిపారు. ఎంఐఎం కి 6-7 స్థానాలు దక్కవచ్చు. సిపిఎం(బి.ఎల్.ఎఫ్) ఒక స్థానం దక్కించుకోవచ్చు. 

అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా ఉన్నా కూడా, చాలా సార్లు జాతీయ ఎగ్జిట్ పోల్స్ కంటే మా సర్వే ఫలితాలు చాలా ఖచ్చితంగా నిజం అయ్యాయని లగడపాటి తెలిపారు. జాతీయ ఎగ్జిట్ పోల్స్ ఎంతసేపు ఉన్నా నార్త్ సైడ్ మాత్రమే ఖచ్చితంగా వస్తున్నాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

80% జిల్లాలో కూటమికే ఆధిక్యం. రేవంత్ రెడ్డి అరెస్ట్ ప్రభావం భారీగానే ఉంది. గతంలో జగ్గారెడ్డి సంఘటన కూడా ప్రభావం చూపిందని లగడపాటి చెపుతున్నారు. అయితే తాను వ్యక్తిగతంగా ఎవరికి అనుకూలంగా చెప్పాల్సిన అవసరం లేదని, తనకు అసలు పార్టీయే లేదని అన్నారు. వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడ గెలుస్తారు అనేది మాత్రం బయటపెట్టడం తనకు ఇష్టం లేదని ఆయన అన్నారు.

ఈ అంచనాల కోసం చాలా సార్లు అనేక విధాలుగా సర్వే చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గత మూడు నెలలుగా తాను ఈ పనిమీదే ఉన్నట్టు లగడపాటి తెలిపారు.ఉత్తర భారత సర్వేలలో యాక్సిస్, టుడే చాణిక్య మాత్రమే సరిగా ఫలితాలను ఇస్తున్నాయని, కానీ వారు ఉత్తర భారతంలో మంచి ఫలితాలు సాధిస్తున్నా, దక్షిణ భారత దేశంలో విఫలం అవుతున్నారని ఆయన అన్నారు. 

Related posts

ఎవరివో…నీవెవరివో!

vimala p

ఎరుపు ద్రాక్షతో.. ఆరోగ్య ప్రయోజనాలు..

vimala p

ఏపీలో .. నేటి నుండే ప్రత్యేక హైకోర్టు…

vimala p