telugu navyamedia
news political Telangana trending VOTE

లగడపాటి సర్వే… అనుకున్నట్టే 68 శాతం దాటిన ఓటింగ్.. విజయం కూటమిదేనన్నమాట…

Lagadapati Telangana Elections Results

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. దీనితో తదుపరి కార్యక్రమం ఎగ్జిట్ పోల్స్. దీనికి సిద్ధంగా ఉన్న లగడపాటి, ముందుగానే చెప్పినట్టుగా, రాష్ట్రంలో 68.5 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైతే కూటమికే పగ్గాలు రానున్నాయా.. ఏమంటే రాష్ట్రంలో 75-80 శాతం వరకు ఓటింగ్ శాతం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టే.. అని ఒక అంచనాకి రావాల్సి వస్తుంది.

అలా కాకుండా 2014 కంటే తక్కువ పోలింగ్ నమోదైతే హంగ్ అని లగడపాటి ముందుగానే ప్రస్తావించారు. తద్వారా స్వతంత్రులు అధికసంఖ్యలో గెలుస్తారని, బీజేపీకి సీట్ల సంఖ్య పెరగవచ్చని కూడా చెప్పారు. నాలుగు జిల్లాలలో కూటమి, మూడు జిల్లాలలో తెరాస, మరో రెండు జిల్లాలలో కూటమి మరియు తెరాస మధ్య హోరాహోరీగా పోటీ ఉండనుందని ఆయన తెలిపారు. మిగిలిన స్థానాలలో అన్ని పార్టీలు పంచుకునే అవకాశాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఎప్పటి లాగానే ఎంఐఎం హైదరాబాద్ లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం మాములే. అయితే నేడు 7 గంటలకు లగడపాటి ప్రెస్ మీట్ ద్వారా తన తాజా నివేదికను వెల్లడించనున్నారు. అయితే పోలింగ్ విషయంలో కూటమికి మార్కులు పడ్డాయి కాబట్టి, ఆయన చెప్పే విషయం దాదాపు అంచనా వేయవచ్చని విశ్లేషకులు చెప్పకనే చెపుతున్నారు.

Related posts

‘ఉత్తర’ మూవీ ప్రెస్ నోట్…

vimala p

అట్టల కంపెనీలో అగ్నిప్రమాదం.. డీసీఎం వాహనం దగ్దం

vimala p

పాక్ కవ్వింపు చర్యలు : అరెస్ట్ చేశాం అని చెపుతూనే, పొగడ్తలు.. !

vimala p