Trending Today క్రైమ్ వార్తలు వార్తలు విద్య వార్తలు సామాజిక

నాలుగేళ్ళ చిన్నారిపై టీచర్ లైంగిక వేధింపులు.. సీసీటీవీ ఫోటేజ్ ద్వారా కేసు నమోదు

Rejected by Woman, man Allegedly rapes 1 year old baby MP

గత కొన్ని దశాబ్దాలుగా మహిళలపై వేధింపులు సహజం అయిపోయాయి. దానికి తగ్గ చట్టాలు ఎన్ని తెచ్చినా ప్రయోజనం కానీ తప్పు చేసేవారిని కాస్త భయపెట్టడం కూడా లేదనేది స్పష్టమైన నిజం… ఇది ఎంత నిజం అని చెప్పాలంటే ఇటీవల పసిపాపలపై జరుగుతున్న అత్యాచారాలే స్పష్టమైన ఉదాహరణ. పాఠశాలలో కూడా పసిపిల్లలపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడుతున్నా ఏడ్చి ఊరుకోవటం తప్ప ఏమి చేయలేని స్థితి. అసలు అటువంటి పని చేయాలని ఆలోచనే రానివ్వని వాతావరణం విద్యాలయం.

కానీ అక్కడే ఇలాంటివి చోటుచేసుకుంటే ఇంకా మిగిలిన చోట నిలువరించడం ఎలా సాధ్యం…. అయితే అమ్మాయిలపై అత్యాచారాలు చేసేది మగవారే కాదు ఆడవారు కూడా అని ఇక్కడ జరిగిన సంఘటన ద్వారా చెప్పవచ్చు.. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మహిళా టీచర్ వక్రబుద్ధితో వ్యవహరించి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతోంది… అయితే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు ఎందుకలా చేస్తుందో కూడా తెలియలేని ఆ చిన్నారి మూగవేదనను ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.. వివరాల ప్రకారం..

ముంబై మహానగరంలోని కుండివిలి ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఎల్.కె.జీ చదువుతన్న నాలుగేళ్ల బాలికపై అదే పాఠశాలలో పనిచేసే ఓ మహిళా టీచర్ ప్రతిరోజూ తాకరానిచోట తాకుతూ లైంగిక వేధింపులకు గురిచేస్తోంది. ఇంటికి వచ్చిన తరువాత రోజు ఏడుస్తున్న తమ గారాల కూతురును బాగా గమనించిన తల్లిదండ్రులు విషయంపై ఆరాతీయగా, టీచర్ ఇబ్బంది పెడుతోందని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నేరం చేసినట్లు తేలడంతో నిందితురాలిని అరెస్టు చేశారు.

Related posts

వైరల్ అవుతున్న నితిన్ ట్వీట్

admin

స్పీకర్ ప్రయాణిస్తున్న విమానం … అత్యవసర ల్యాండింగ్‌

jithu j

తడిచిపోనున్న తెలుగు రాష్ట్రాలు…మరో రెండు రోజులు..

chandra sekkhar

Leave a Comment