telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

జాబ్ చేయకపోయినా విద్యార్హతను బట్టి స్త్రీలకు వేతనం… ఎక్కడంటే ?

Indians black money will be 34 lak crores

ఇంటర్మీడియట్ అంతకంటే తక్కువ చదువుకున్న మహిళలకు నెలకు 500 దీనార్లు (దాదాపు లక్ష రూపాయలు), సెకండరీ క్వాలిఫికేషన్ ఉన్నవారికి 550 దీనార్లు (దాదాపు లక్షా 28వేల రూపాయలు), డిప్లొమా చదివిన వారికి 600 దీనార్లు (సుమారు లక్షా 40 వేల రూపాయలు), యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లకు 650 దీనార్లు(దాదాపు లక్షా 50వేల రూపాయలు), మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లకు 700 దీనార్లు (సుమారు లక్షా 63వేల రూపాయలు) నెలవారీ వేతనంగా ప్రభుత్వమే చెల్లించాలి. చదువుకుని ఉద్యోగాలు చేయని మహిళలకు ఆర్థిక సహకారం అందించాలి. ఇంటి పనితోపాలు పిల్లలను చూసుకోవడం వంటి ఎన్నో పనులను స్త్రీలు చేస్తున్నారు. వారికి ప్రతీ నెలా ప్రభుత్వమే జీతాలను చెల్లించాలి..’ అంటూ ఓ కొత్త ప్రతిపాదనను కువైట్ ఎంపీ మాజీద్ అల్ ముతైరీ తెరపైకి తెచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. మీడియా, ఇతర ప్రముఖులతో పాటు మహిళలు కూడా ఆయన ప్రతిపాదనపై మండిపడుతున్నారు. ‘మహిళలంటే కేవలం వంట పని, ఇంటిపనికి మాత్రమే పరిమితం కావాలా.. ఎంత చదువుకున్నా.. బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయకూడదా..? ఆ ఎంపీ ప్రతిపాదన కనుక అమల్లోకి వస్తే.. మహిళలకు బయట ఉద్యోగాలు లభిస్తాయా..? వంటింట్లో కూర్చున్నా.. జీతం వస్తుంది కదా.. ఉద్యోగం ఎందుకంటూ అవహేళన చేయరా..? అయినా విడాకుల కేసులను తగ్గించేందుకు ఈ తరహా సలహాలు ఇవ్వడం బదులు వేరే కఠిన చట్టాలను తెచ్చే దిశగా ఆలోచిస్తే మంచిది..’ అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను చెప్పిన ఉద్దేశాన్ని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారనీ ఎంపీ ముతైరీ స్పందించారు. తనపై వచ్చిన విమర్శలకు ఆయన బదులిచ్చారు. ఎంతో చదువుకుని కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటి పనులకే పరిమితమైన వారికి ఆర్థిక స్వావలంభన చేకూర్చడానికే తాను ఈ తరహా ప్రతిపాదనను తెచ్చినట్లు వివరించారు. తాను చెప్పింది పెళ్లయిన స్త్రీల గురించి మాత్రమేననీ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇంటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలా..? బయట ఉద్యోగం చేయాలా..? అన్న అంతిమ నిర్ణయం మాత్రం మహిళల ఇష్టానికే వదిలేయాలన్నారు. ఒకవేళ ఇంటి సంరక్షణ బాధ్యతను తీసుకుంటే మాత్రం.. ఆయా స్త్రీలకు నెలవారీ వేతనాన్ని ప్రభుత్వం చెల్లించే దిశగా ఆలోచించాలని మాత్రమే తాను చెప్పానని ముతైరీ చెప్పుకొచ్చారు.

Related posts