telugu navyamedia
andhra news political

మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ: కుటుంబ రావు

Kutumba Rao comments Mohan babu

సినీ నటుడు మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ అని ఆయన వ్యాఖ్యానించారు. మోహన్ బాబు సెలిబ్రీటీ ముసుగు వేసుకున్న దొంగని ఆరోపించారు. ఆయనకు కావాల్సింది సెలబ్రీటీ స్టేటస్ అని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై మోహన్ బాబు వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవాలు తెలియకుండా ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధపు ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు. ఫైల్ తీసుకుని రండి.. బాకీ ఎంత ఉందో తెలుసుకుని మిగతా కాలేజీలతో పాటు ఇచ్చేస్తామని సూచించారు. ధర్నాల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును చెడగొడుతున్నారని విమర్శించారు. మోహన్ బాబు ఎంత పెద్ద నటుడో తనకైతే తెలీదని.. పద్మశ్రీ ఇచ్చారు కాబట్టి పెద్ద నటుడే అయ్యి ఉంటారన్నారు. తనపై బురద జల్లడానికి ప్రయత్నించారన్నారు. ముసుగు తీసి వైసీపీ తరఫున ప్రచారం చేసుకోండని హితవు పలికారు.

Related posts

రెండో విడుత పంచాయతీ పోలింగ్ ప్రారంభం

vimala p

బాలికను దత్తత తీసుకుని చదివిస్తాం: చంద్రబాబు

vimala p

స్కూళ్ళు తెరిచేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న కేంద్రం!

vimala p