telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘కూర్చుంటే కేసు, నిలబడితే కేసు’… వైసీపీపై చంద్రబాబు ఫైర్

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వుంటే వైసీపీ వుండేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎన్నో దాడులు చేశారని, 690 కేసులు బనాయించారంటూ వైసీపీపై మండిపడ్డారు. ‘కూర్చుంటే కేసు, నిలబడితే కేసు’ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్టు పెడుతున్నారని విమర్శించారు.

ఇన్నేళ్లలో ఒక విచిత్రమైన నాయకుడిని చూస్తున్నామని సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఏం పురోగతి సాధించారు? అని ప్రశ్నించారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డుపడ్డారని మండిపడ్డారు. ఇసుక ఇప్పుడైనా దొరుకుతోందా? అని ప్రశ్నించారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ.4 వేలు, లారీ ఇసుక రూ.10 వేలు ఉందని విమర్శించారు.

Related posts