telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ : ‘కురిసెన.. కురిసెన..`సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల‌

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. రీసెంట్‌గా  ఈ చిత్రం నుండి అనూప్ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ప్ర‌ముఖ ప్లే బ్యాక్ సింగ‌ర్స్ అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన అద్భుతంగా ఆల‌పించిన  ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ సాంగ్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను విడుద‌ల‌చేసింది చిత్ర‌యూనిట్‌. “ఒరేయ్‌బుజ్జిగా..”లో ఫ‌స్ట్ సాంగ్ కురిసెన‌..కురిసెన‌. అనూప్  రూబెన్స్ సంగీత సార‌థ్యంలో అర్మాన్‌ మాలిక్, పి.మేఘన అద్భుతంగా పాడారు. కె.కె గారు చాలా అందంగా లిరిక్స్ రాశారు. ‘‘కురిసెన.. కురిసెన` పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే  సోష‌ల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Related posts