telugu navyamedia
news political trending

అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. కుండబద్దలు కొట్టిన కుమారస్వామి..

CM Kumaraswamy killing order

కర్ణాటక లో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందా లేదా అన్నట్టుగానే ప్రకటి క్షణం అనేక వివాదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమారస్వామి అయినప్పటి నుండి లుకలుకలు అలాగే కొనసాగుతున్నాయి. ఒకపక్క కాంగ్రెస్, మరోపక్క బీజేపీ కుమారస్వామికి పెద్ద సమస్యగానే తయారయ్యాయి. దీనితో రెంటికి సమాధానం చెప్పుకుంటూనే పదవిలో కనసాగుతున్నాడు. తాజాగా, ముఖ్యమంత్రి కుమారస్వామి సంకీర్ణ భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ‘గీత దాటుతున్నారు’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తరచు తమ నేతగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పేర్కొనడంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. తానేమీ పదవిని పట్టుకుని వేలాడాలనుకోవడం లేదని మీడియాతో మాట్లాడుతూ ఆయన కుండబద్ధలు కొట్టారు.

కుమారస్వామి కాంగ్రెస్ నేతలు తమ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకోవాలని హెచ్చరించారు. బహిరంగ సభల్లో తరచు తమ నేత సిద్ధరామయ్యేనంటూ ఎమ్మెల్యేలు చెప్పడాన్ని కుమారస్వామి తప్పుప్టటారు. కాంగ్రెస్ నేతలు అన్ని హద్దులు మీరుతున్నారని అన్నారు. గద్దె దిగడానికి తాను సిద్ధమేనన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు బీజేపీ బేరసారాలు సాగిస్తోందంటూ నిన్నమొన్నటి వరకూ మండిపడిన కుమారస్వామి, తాజాగా భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కే హెచ్చరికలు చేయడంతో కర్ణాటక రాజకీయాలు మళ్లీ ఒక్కసారిగా వేడెక్కాయి.

Related posts

కోర్టుకి వెళ్లయినా ‘దండుపాళ్యం 4’ విడుదల చేస్తాం – నిర్మాత వెంకట్‌

vimala p

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు

vimala p

12 నుండే ఏపీ అసెంబ్లీ .. 13న ప్రమాణస్వీకారం.. 14న గవర్నర్ ప్రసంగం..

vimala p