telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటకీయం : .. సభకురానివారిపై అనర్హత వేటు.. ఎన్నికలకు సిద్ధం కావటం.. ఇదే స్వామి ఆఖరి అస్త్రమా..!

CM Kumaraswamy killing order

కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం మొదటి నుండి ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, బీజేపీ వాటిని మరీ తీవ్రతరం చేసింది. ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశాలు ఆ రాష్ట్రంలో అగుపించడం విశేషం. ఇక 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు వృధా ప్రయాసగా మారాయి. రెబల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకోవడంతో.. రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 15 గా ఉంది.

సుప్రీం కోర్టు ఎమ్మెల్యేల విషయంలో జోక్యం చేసుకోదని, అలానే రాజీనామాలకు ఉపసంహరించుకోవాలనే విషయాన్నీ ఎమ్మెల్యేలకు చెప్పదని వాళ్లకు స్వేచ్ఛను ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. సభకు రావొచ్చా.. రాకూడదా అన్నది ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్నప్పటికీ, ఒకవేళ ఎమ్మెల్యేలు హాజరకు కాకుంటే.. వారిపై విప్ ను ప్రయోగించవచ్చు. హాజరుగని వాళ్ళను అనర్హులుగా ప్రకటించవచ్చు. అదే జరిగితే మరలా ఎన్నికలు జరుగుతాయి. ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సి వస్తుంది. బుజ్జగింపులకు లొంగని పక్షంలో ఫైనల్ గా ఈ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తోంది మరి కుమారస్వామి ఫైనల్ అస్త్రానికి ఎమ్మెల్యేలు లొంగుతారా లేదా అన్నది రేపటికి తేలిపోతుంది.

Related posts