telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన కేటీఆర్

Mahesh-with-KTR

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆగ‌స్ట్ 9న తన 44వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానులు కొన్ని చోట్ల ర‌క్త‌దానాలు, అన్న‌దానాల‌తో పాటు ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానుల నుంచి మహేష్ బాబుకు సోష‌ల్ మీడియా వేదికగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. తాజాగా మ‌హేష్‌కి కేటీఆర్‌ త‌న ట్విట్ట‌ర్ ద్వారా బిలేటెడ్ బ‌ర్త్ డే విషెస్ అందించారు. త‌న‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. గ‌తంలో విజన్ ఫర్ బెటర్ టుమారో అనే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ ఒకే వేదికపై పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఇక మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ సినిమా “సరిలేరు నీకెవ్వరూ”లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా… రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts