telugu navyamedia
news political Telangana

వార్డు ఆఫీస‌ర్ నియామ‌కాలు చేపడుతాం: కేటీఆర్‌

ktr telangana

తెలంగాణ పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వ‌రలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస‌ర్ పోస్టుల ను భర్తీ చేస్తామని ప్ర‌క‌టించారు. మొద‌టి మూడేండ్లు ప్రొబేష‌న‌రీ కాల‌ప‌రిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాల‌యాలు కూడా నిర్మిస్తామ‌ని తెలిపారు. కార్పొరేట‌ర్‌, వా‌ర్డు ఆఫీస‌ర్ క‌లిసి ప‌నిచేస్తార‌ని మంత్రి వెల్ల‌డించారు.

హైద‌రాబాద్ అభివృద్ధికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు శాస‌న‌మండ‌లిలో మంత్రి స‌మాధాన‌మిచ్చారు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌కు క్ర‌మంత‌ప్ప‌కుండా నిధుల‌ను ఇస్తున్న‌ద‌ని చెప్పారు.  జీహెచ్ఎంసీలో ఎస్ఆర్‌డీపీ ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి ప‌నులు చేపట్టినట్టు తెలిపారు.

Related posts

జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి!

vimala p

పూజా సమయంలో దూసుకెళ్లిన కొత్త కారు..

vimala p

అర్దరాత్రి కోడెల విగ్రహ దిమ్మె కూల్చివేత..

vimala p