telugu navyamedia
తెలంగాణ వార్తలు

బుడ్డోడి మాట‌ల‌కు కేటీఆర్ ఫిదా..

పేద‌రికం అవ్వ‌చ్చు..కోవిడ్ కార‌ణం కావ‌చ్చు..ఇంట్లోని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఈ క్రమంలో కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని.. చదువుకుంటునే పని చేస్తున్న విద్యార్ధులెందరో ఉన్నారు. తాజాగా ఇలాంటి సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది . స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జై ప్రకాశ్‌ ఉదయం పూట పేపర్‌ బాయ్‌గా పని చేసుకుంటున్నాడు.

ఇది గమనించి ఆ దారిలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి.. జై ప్రకాశ్‌ని పలకరించాడు. ఏం చేస్తున్నావ్‌.. ఏ స్కూల్లో చ‌దువుతున్నావు అని ప్రశ్నించాడు. గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నానని చెబుతాడు. అనంతరం సదరు వ్యక్తి ఈ ఏజ్‌లో నువ్వు పేపర్‌ వేస్తున్నావ్‌ ఎందుకు అని ప్రశ్నించగా.. అప్పుడు జై ప్రకాశ్‌ ‘ఏం.. పేపర్‌ వేయొద్దా’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. ‘

jagitayl paper boy: 'పేపర్‌ వేస్తే తప్పేంటి'.. బుడ్డోడి కాన్ఫిడెన్స్‌ వేరే  లెవల్... కేటీఆర్‌ ఫిదా - minsiter ktr tweets jagtial paper boy video goes  viral | Samayam Telugu

స‌ద‌రు వ్య‌క్తి వెయ్యాలి త‌ప్పేమి లేదు..కానీ.. ‘చదువుకునే ఏజ్‌లో పని చేస్తున్నావ్‌ కదా’ అంటే…చదువుకుంటున్నా..పనిచేసుకుంటున్నా అని.. అందులో తప్పేముందని , ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో మంచి ఉన్నతి స్థితికి వస్తాయని ఆత్మవిశ్వాసంతో చెబుతాడు. ఇక వీడియో మొత్తంలో బుడ్డోడి ఎక్స్‌ప్రెషన్స్‌, కాన్ఫిడెన్స్‌ వేరే లెవల్‌.

కాగా..రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారన్నది నెటిజన్లందరికీ బాగా తెలిసిన విషయమే. ఏ చిన్న విషయమైనా సరే కాస్త వినూత్నంగా ఉంటే అందుకు సంబంధించిన ఫోటో లేదా వీడియోను ట్వీట్టర్ లో పోస్ట్ చేస్తారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ బాలుడి ఆత్మవిశ్వాసాన్ని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

జయప్రకాశ్ అనే ఆ బాలుడి సమాధానానికి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అతని ఆలోచనా విధానాన్ని , స్పష్టతను అభినందిస్తూ ఆ వీడియోను షేర్ చేశారు. జయప్రకాశ్ భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించారు.

Related posts