telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నికల తేదీలపై తాను వ్యాఖ్యలు చేయలేదు: కేటీఆర్

ktr telangana

నేను అనని మాటలను తనకు ఆపాదిస్తూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల తేదీలపై తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. నవంబరులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.

జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగిందని చెప్పారు.ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని తెలిపారు. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగిందని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.

Related posts