telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో తమిళనాడు వాసులు..స్టాలిన్ రిక్వెస్ట్ పై స్పందించిన కేటీఆర్!

KTR TRS Telangana

తమిళనాడుకు చెందిన పలువురు చిరు వ్యాపారులు తెలంగాణలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన ట్వీట్ పై తెలంగాణ మునిసిపిల్, ఐటీ మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించారు. ట్విట్టర్ వేదికగా, స్టాలిన్, ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టారు. “తమిళనాడుకు చెందిన పలువురు చిరు వ్యాపారులు నిజామాబాద్ జిల్లా, బాల్కొండ, కిసాన్ నగర్ లో చిక్కుతున్నారు. వారందరికీ ఆహారం, ఆశ్రయం లేదు. దయచేసి మీరు కల్పించుకోవాలని పేర్కొన్నారు.

వారి వివరాల కోసం తమిళనాడు స్మాల్ వెండార్స్ డెవలప్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాసమురుగేశన్ ను 7397585802 నంబర్ లో సంప్రదించవచ్చు” అంటూ తెలంగాణ సీఎంఓకు, కేటీఆర్ కు దాన్ని పంపారు. స్టాలిన్ ట్వీట్ కు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. “స్టాలిన్ సార్… వుయ్ విల్ టేక్ కేర్… నా టీమ్ సమన్వయం చేసుకుంటుంది” అని తెలిపారు. ఈ రెండు ట్వీట్లూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related posts