telugu navyamedia
political Telangana trending

16 స్థానాలలో గెలిపించండి.. కేసీఆర్ కేంద్రంలో కీలకం అవుతారు.. : కేటీఆర్

KTR Tribute to CRPF Jawans  Hyderabad

నేటినుండి తెరాస లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగానే తొలిసభను కరీంనగర్ లో నేడు నిర్వహిస్తుంది తెరాస. ముఖ్యనేతలందరు హాజరైన ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, ఢిల్లీ గద్దె మీద మనం కీలకం కాబోతున్నాం. ఢిల్లీలో ప్రబలమైన శక్తిగా ఉంటే తప్ప మన హక్కులు సాధించుకోలేం. తద్వారా ఎవరూ ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే శక్తి మనకు ఉంటుందన్నారు. రాహుల్‌, మోదీ దొందూ దొందే అని ప్రజలకు తెలిసిపోయింది. వీరిద్దరూ ఎద్దెవా చేసుకున్నదే తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు.

మన 16 మంది ఎంపీలకు మరికొంత మంది తోడు అవుతారనే నమ్మకం ఉందన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలన్ని కలిసి 70 స్థానాలకు తగ్గకుండా.. 100 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయి. మొత్తంగా 100 స్థానాలతో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉంది.

కేసీఆర్‌ లాంటి మేధోసంపత్తి గల నాయకుడు.. ఏ విధంగానైతో తెలంగాణలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారో.. ఆ విధంగా కేసీఆర్‌ నేతృత్వంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తాయి. దీంతో ఢిల్లీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకం కానుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Related posts

వ్యాను బోల్తా 30 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

vimala p

పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

vimala p

హాస్టళ్లపై  జీహెచ్‌ఎంసీ కొరడా..రూ.10 వేల  జరిమానా

ashok