telugu navyamedia
news political Telangana trending

కేటీఆర్ రోడ్ షోలో కీలక వ్యాఖ్యలు…

ఈరోజు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి ని సాధించిందని అన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎలాంటి గొడవలు జరగలేదన్న ఆయన రాష్ట్రమంతటా ప్రజలందరు కలిసిమెలిసి ఉన్నారని అన్నారు. మంచినీళ్లు, కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని గతంలో కరెంట్ ఉంటే వార్త, నేడు అది పోతే వార్త అయిందని ఆయన అన్నారు. పేకాట క్లబ్ లేదు, గుడుంబా గబ్బు లేదు, పోకిరీల ఆటలు లేవు, సున్నం చేరువును బాగు చేసుకుంటున్నాము జీవో 58,59 ద్వారా భూ యాజమాన్య పట్టాలు ఇస్తున్నాము అని అయన అన్నారు. ఐదు లక్షల సి సి కెమెరాలు పెట్టుకున్నామన్న ఆయన వాటిని పది లక్షలు చేద్దామని అన్నారు. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ల బయలుదేరారని, తాగి బండి నడపండి, ఛాలాన్ లను బల్దియా కడుతాది అంటున్నారని అన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడా అని ఆయన ప్రశ్నించారు. వరద సాయం ఆపి వారు వస్తే 25 వేలు ఇస్తామంటున్నారని అయన విమర్శించారు. మేము చేసిన వంద పనులు చూపిస్తా…కేంద్రం నగరంలో చేసిన ఒక్క పనిని చూపిస్తారా కిషన్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు. చార్మినార్ వద్ద కావాలనే ధర్నా చేశారని, హిందూ ముస్లిం గొడవలు పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు.  ఎలాంటి హైదరాబాద్ కావాలో మీరే ఆలోచించండి అని ఆయన అన్నారు. హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ ఆగమైతదన్న ఆయన ఇప్పుడు నగరం బాగుంది కాబట్టే గూగుల్,ఆపిల్ వచ్చాయి. గొడవలు ఉంటే అవి రావని అన్నారు.

Related posts

ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు .. స్పందించిన చరణ్..

vimala p

తెలంగాణ ప్రభుత్వంపై నటి అమల ప్రశంసలు!

vimala p

రాశిఫలాలు : .. పనులు పూర్తిఅవుతాయి.. భాగస్వామి అనారోగ్యం..

vimala p