telugu navyamedia
andhra news political Telangana trending

రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలు … సాధిస్తాం… : కేటీఆర్

KTR Counter pawan comments

తెలంగాణాలో అత్యంత భారీగా గెలుపొందిన తెరాస పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా అంతే గొప్ప విజయాన్ని సాదిస్తుందాని కేటీఆర్ పేర్కొన్నారు. తద్వారా తాము కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం జాతీయంగా కూడా వెలితి కనిపిస్తున్నదని, తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నట్టే జాతీయంగా కూడా అది సాధ్యం అని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం టీడీపీ గల్లంతు అవుతుందని ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ లో ప్రతిపక్షాలు అన్ని ఏకమైనా కూడా తెరాస ఘనవిజయాన్ని ప్రజలు కట్టబెట్టారని ఆయన తెలిపారు. ఈ విజయానికి కారణం అయినా ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు కేటీఆర్. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికలలో తెరాస కు 13 శాతం ఓటింగ్ అదికాగం వచ్చిందని ఆయన చెప్పారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేదే ప్రస్తుత తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో సాధారణ ప్రజలు ఆరోగ్యం, విద్య, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పన వంటి రంగాలలో అభివృద్ధిని కోరుకుంటున్నరని ఆయన అన్నారు.

ఏపీలో వైసీపీకి మద్దతు ఇచ్చే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని, ఇప్పటి వరకు అనేక పార్టీలతో మిత్రత్వం ఉన్నది కానీ ఇంతవరకు ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకి తమ మద్దతు పరిమితం కాలేదని ఆయన చెప్పారు. ఏపీలో వైసీపీ అధినేత గట్టి పోటీ ఇస్తున్నారని, వారికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ద్రుష్టి అంతా తెలంగాణపై పెట్టమని, అనంతరం అంశాల వారీగా ముందుకెళ్తామని ఆయన తెలిపారు.

Related posts

బ్రిటన్ లో రావుల్ విన్సీ..ఇండియాలో రాహుల్ గాంధీ: యోగి

vimala p

అభినందన్‌ కోసం భారత్ స్పెషల్‌ ఫ్లైట్‌.. నిరాకరించిన పాక్!

vimala p

చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్

vimala p