telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పెట్రోల్‌ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్‌ సెటైర్‌

ktr telangana

బీజేపీ పార్టీపై మంత్రి కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. ఐటిఐఆర్ రద్దు చేసి నోట్లో మట్టికొట్టింది బిజెపి ప్రభుత్వమని..GDP పెంచుతామని…గ్యాస్,డీజిల్,పెట్రోల్ ధరలు పెంచారని నిప్పులు చెరిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లల్లో 24 వేల ఉద్యోగాల భర్తీ మాత్రమే చేసిందని గుర్తు చేశారు కేటీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,32,799 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసిందని..దీనిపై తాను చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని… 43 శాతం ఫిట్ మెంట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అయినా రామచంద్ర రావు తీసుకువచ్చారా ? అని నిలదీశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బిజెపికి లేదని ఫైర్‌ అయ్యారు. ఏ అర్హత, నైతిక హక్కుతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బిజెపి ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు.

Related posts