తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

కాంగ్రెస్‌ నేతలను తరిమి కొట్టాలి: కేటీఆర్‌

kcr and ktr campaigns in telangana

ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్‌ వాళ్లు మాత్రం చనిపోయిన వాళ్ల వేలి ముద్రలు వేసి కోర్టుకు వెళ్లారని విమర్శించారు. ఇది నిజమని నమ్మితే కాంగ్రెస్‌ నేతలను తరిమికొట్టండని కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఎవరూ కలగనని విధంగా కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతున్న ఆయనను గద్దె దింపాలా’ అంటూ కేటీఆర్‌ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

కరువు కోరల్లో ఉన్న సిరిసిల్లను మూడేళ్లలో అభివృద్ధిలోకి తెచ్చామని కేటీఆర్ అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సిరిసిల్లను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో ఇసుక ద్వారా రాష్ట్రానికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరిస్తే.. కాంగ్రెస్‌ హయాంలో 40 కోట్ల ఆదాయం కూడా రాలేదని విమర్శించారు. తాను చెప్పినవి అబద్ధమైతే వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాలన్న కేటీఆర్‌.. నిజమని నమ్మితే కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కకుండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

Related posts

రేవ్ పార్టీలో ‘మహర్షి’ అరెస్ట్.. 7గురు మహిళలతో అలా చేస్తూ

nagaraj chanti

సూర్యాపేట దగ్గర లక్షల రూపాయల ‘దారి దోపిడీ’

admin

మోదీకి గడ్డు కాలమే: శివసేన

admin

Leave a Comment