telugu navyamedia
political Telangana

అద్భుతంగా ఉంది..అభినందనలు బావ: కేటీఆర్

TRS Working President KTR Meet Harish Rao
సిద్దిపేటలో సుమారు 20 కోట్ల తో నిర్మించిన స‌మీకృత మార్కెట్ బిల్డింగ్‌ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోల‌ను హ‌రీశ్ త‌న ట్విట్టర్ లో పోస్టు చేశారు. వాటిని చూసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మార్కెట్ యార్డ్ అద్భుతంగా ఉన్నాయ‌ని హ‌రీశ్‌ను కేటీఆర్ మెచ్చుకున్నారు. “చాలా అద్భుతంగా ఉంది. నా అభినందనలు బావా” అని కామెంట్ చేశారు. ఇక కేటీఆర్ అభినందనల ట్వీట్ ను చూసిన హరీశ్ రావు “మెనీ థ్యాంక్స్” అని రిప్లయ్ ఇచ్చారు.
ప్రపంచస్థాయి వ‌స‌తుల‌తో ఈ మార్కెట్‌ను తీర్చిదిద్దారు. ఒకే చోట కూర‌గాయ‌లు, మాంసాన్ని విక్రయించేందుకు మార్కెట్‌ను అత్యాధునికంగా నిర్మించారు.  రైతులు, వ్యాపారులు సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలు సాగించుకునేందుకు అన్ని రకాల వసతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే తరహా మార్కెట్ సెంటర్లను మరిన్నింటిని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది.

Related posts

సమ్మె తీవ్రతరం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.. దిగివచ్చేది లేదంటున్న ప్రభుత్వం..

vimala p

పవన్ దీక్షకు తరలి రావాలి.. నాదెండ్ల మనోహర్ పిలుపు

vimala p

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం: మోదీ

vimala p